హరియాణా CM మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చండీగఢ్‌లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిన్న తనకు వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చిందని, OPSను అమలు చేస్తే 2030 కల్లా దేశం దివాలా తీస్తుందని ఆ సందేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వెల్లడించారని సీఎం వ్యాఖ్యానించారు. కాగా కొన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పింఛను విధానం(OPS) అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఈక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.