ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే..”జగన్ కు నమ్మక ద్రోహం చేసి ఉంటే నన్ను సర్వనాశనం చేయమని దేవున్ని కోరుకుంటున్నా. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నా మిత్రుడితో చెప్పిస్తారు. విచారణ జరపకుండా పక్కదారి పట్టిస్తున్నారు. అనిల్ ఏమైనా ఉంటే నాతో మాట్లాడు. పిల్లల ప్రస్తావన ఎందుకు. ఇంఛార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, నేను ఆరోగ్యవంతమైన రాజకీయం చేస్తాం. ” అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.