కర్ణాటక రామనగరలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మిగిలిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పుల బాధ తాళలేకే ఆ కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.