2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రధాని మోదీపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లపై ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లోగా దీనిపై సమాధానమివ్వాలని కోరింది. తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్కు వాయిదా వేసింది.