కేరళ సర్కారు సామాన్యులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరను రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత వినియోగం కోసం కొత్తగా కొనుగోలు చేసిన కార్లు, ప్రైవేట్ సర్వీస్ వాహనాలపై ట్యాక్స్ పెంచనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ వేణుగోపాల్ ఈవిషయాన్ని ప్రకటించారు. సోషల్ సెక్యూరిటీ సీడ్ ఫండ్‌కు రూ.750 కోట్ల అదనపు ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై సెస్ విధిస్తున్నట్లు వెల్లడించారు.