బాల్య వివాహాలు చేసుకున్న వారే లక్ష్యంగా అసోం పోలీసులు శుక్రవారం భారీ ఆపరేషన్ చేపట్టారు. బాలికలను పెళ్లి చేసుకున్న వారిని 1800 మందికి పైగా అరెస్ట్ చేశారు. వీరిపై ఇప్పటికే 4,004 కేసులు నమోదు చేశారు. మరో 4 రోజులు ఈ ఆపరేషన్ జరుగుతుందని సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. 14 ఏళ్ల లోపు వయసున్న బాలికలను వివాహం చేసుకున్న వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa