గతంలో చంద్రబాబును ఎందుకు కలిశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. బెంజ్ కారులో వెళ్లి కలిస్తే అప్పుడు నిఘా ఏమైందని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... మాజీ మంత్రి, తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు బాధించాయని.. అనిల్ ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలని.. తన పిల్లల ప్రస్తావన ఎందుకన్నారు. తన కుటుంబం అనిల్ కుటుంబం వేరని ఎప్పుడూ అనుకోలేదని.. తనకు అధికార దాహం ఉంటే ఆనాడే తెలుగుదేశం పార్టీలో చేవాడిని అన్నారు. తాను ప్రతిపక్షంలో తెలుగుదేశం పై పోరాడాను అన్నారు. అనిల్ కుమార్ యాదవ్‌ను కార్పొరేట్ చేసింది ఎవరు.. ఎమ్మెల్యేని చేసింది ఎవరు.. ఆనం వివేకానంద రెడ్డి కాదా అన్నారు. ఆనం కుటుంబం పై మాట్లాడిన మాటలు మర్చిపోయావా.. అనిల్ మంత్రి అయిన రోజు ఎంత మంది ఎమ్మెల్యేలు ఆయనతో వచ్చారన్నారు.
డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు నియోజకవర్గంలో ఉన్నానని.. అన్ని చర్చలు తిరిగి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నాను అన్నారు. డిసెంబర్ 25న తాను చంద్రబాబు నాయుడుని ఎలా కలుస్తానని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధిష్టానం తనను అనుమానించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నానని.. అమెరికా అధ్యక్షుడుకే సలహాదారుడుగా ఉండే సామర్థ్యం ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy).. సినిమా హాల్లో రెండు లక్షలు వసూలు చేస్తున్నట్టు ఆడియో లీకులు చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఆయనకు తెలియదా అన్నారు. ఇసుకాసురులు, మద్యం వ్యాపారుల ఆడియోలు రిలీజ్ చేస్తే.. మరుసటి రోజే సజ్జల పోస్ట్ ఊడిపోతుందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు లీకులు ఇవ్వడం ఎందుకన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు వందలాది మంది సోషల్ మీడియాలో పనిచేశారని.. జైళ్లకు పోయారు దెబ్బలు తిన్నారు.. సర్వస్వం కోల్పోయారన్నారు. ఈ ప్రభుత్వం రాగానే కొడుకు సజ్జల భార్గవ్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా ఇంఛార్జ్ ఎలా అయ్యారన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్ రెడ్డికి శుభాభినందనలు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో తన శక్తి మేరకు పని చేశానని.. ఆదాల ఇంఛార్జ్‌గా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి.. ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
కోటంరెడ్డి తన ఫోన్ ట్యాప్ అయ్యిందంటూ కొద్దిరోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. ఏకంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని మీడియాకు విడుదల చేశారు. దీంతో నెల్లూరు రూరల్ రాజకీయాలు వేగంగా మారాయి. కోటంరెడ్డికి వైఎస్సార్‌సీపీ చెక్ పెట్టి.. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ప్రకటించారు.
మొన్నటి వరకు విషయ పరిస్థితికి చేరుకొన్న స్థితి నుంచి తాజాగా నందమూరి తారకరత్న క్రమంగా కోలుకొంటున్నారు. ఇదిలావుంటే తారకరత్న బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం రోజురోజుకి మెరుగుపడుతోంది. తారకరత్న గుండె, కాలేయం ఇతర అవయవాలన్నీ బాగున్నాయని.. మెదడుకు సంబంధించి వైద్యం అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ నుంచి నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు.. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని.. అవసరమైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. నారాయణ హృదయాలయ తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు బులిటెన్ విడుదల చేస్తూ.. ఆయన అభిమానులకు ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం గురించి నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులతో చర్చిస్తున్నారు.
నందమూరి తారకరత్న జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా ఓ మసీదులోకి వెళ్లి అందరూ బయటకు వచ్చారు. మళ్లీ పాదయాత్ర ప్రారంభించగా.. కొద్దిసేపటికే నడుస్తూ ఉన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు ఆయన్ను దగ్గరలో ఉన్న కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమికంగా చికిత్స అందించి.. కుప్పంలోనీ పీఈసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ తారకరత్నకు వైద్యం కొనసాగింది.
అయితే కుప్పం పీఈసీ వైద్యుల సలహా మేరకు తారకరత్నను బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పురందేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లారు.. ఆస్పత్రిలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే నారాయణ హృదయాలయ కూడా ఎప్పటికప్పుడు తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు రెండు హెల్త్ బులిటెన్‌లు విడుదల చేశారు. మళ్లీ హెల్త్ బులిటెన్ విడుదల చేయాల్సి ఉంది.