ఏపీ హైకోర్టు పలువురు ఐఏఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న ఐఏఎస్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా అని నిలదీసింది. ఏమవుతుందిలే అని బరితెగింపు ప్రదర్శిస్తే ఊరుకోమని హెచ్చరించింది. ఉపాధిహామీ పెండింగ్ బిల్లుల కేసులో గోపాలకృష్ణ ద్వివేది, S S రావత్ లు హాజరవ్వగా, వీరిపై 70 కోర్టు ధిక్కరణ కేసులు ఉండడంతో విస్మయం వ్యక్తం చేసింది.