మణిపూర్‌లోని ఉఖ్రుల్లో భూమి కంపించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఉఖ్రుల్‌కు 94 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. దీనివల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా వివరాలు తెలియలేదు.