ఛత్తీస్ గడ్ ధమ్ తరీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షుద్ర పూజలు చేసే వ్యక్తిని అతడి శిష్యుడు హత్యచేసి రక్తం తాగాడు. బసంత్ సాహు(50) దగ్గర రౌనక్ సింగ్ ఛబ్రా అలియాస్ మన్య(25) క్షుద్రపూజలు నేర్చుకుంటున్నాడు. గురువుని చంపి అతడి రక్తం తాగితే తనకు క్షుద్రపూజలు చేసే శక్తులు వస్తాయని భావించాడు. బసంత్ క్షుద్రపూజలు చేస్తుండగా అతడిపై దాడి చేసి చంపి రక్తం తాగాడు. అనంతరం మృతదేహానికి నిప్పుపెట్టాడు.