భార్యను దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. లంగర్హౌస్కి చెందిన కరీనా బేగం(30) భర్తతో విభేదాల కారణంగా పుట్టింటికి వచ్చేసింది. తన ముగ్గురు పిల్లల పోషణ కోసం టీచర్‌గా పనిచేసేది. ఈక్రమంలో తన దారికి రావట్లేదనే అక్కసుతో ఆమె భర్త పగ పెంచుకున్నాడు. స్కూల్‌కి వెళ్తుండగా అడ్డగించి, మాట్లాడుతున్నట్లు నటిస్తూ కరీనా తలపై రాడ్డుతో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.