దువ్వూరు మండల పరిధిలోని చిన్నసింగన పల్లె సచివాలయమును శనివారం ఎంపీడీవో జగదీశ్వరరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయంలోని రికార్డులను పరిశీలించి వాలంటీర్లతో, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. ఆయుష్మాన్ భారత్ సర్వేను రెండు మూడు రోజుల లోపల పూర్తి చేయాలని వాలంటర్లకు సూచించారు.
సచివాలయ సిబ్బంది ప్రతిరోజు సమయపాల పాటించాలని ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సాయంత్రం 5 గంటలకు వెళ్లాలని సూచించారు. రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్ వేయాలని తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని, సచివాలయానికి వచ్చిన ప్రజలను వారు వచ్చిన పనులను అడిగి తెలుసుకుని చేసి పంపగలరని సిబ్బందికి ఎంపీడీవో సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులై ఉండి ఇంకా రానివారు ఉంటే వారిని మంజూరు చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు ఏ. ఆనందరావు, మౌనిక , సచివాలయ సిబ్బంది మునిశేఖర్, సురేంద్ర, మధుసూదన్ రెడ్డి, రవీంద్ర, రూపా బాయ్, తులసికుమారి, వాలంటీర్లు పాల్గొన్నారు.