రాహుల్ ప్రధాని అయిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. ప్రధానిగా ఆయన తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పై చేస్తారని తెలిపారు. విజయనగరం జిల్లాలో 'చేయి చేయి కలుపుదాం.. రాహుల్ గాంధీని బలపర్చుదాం' అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.