అచ్యుతాపురం మండలం మునగపాక సముద్ర తీరంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఉదయం నుంచే జాతర ప్రారంభమైంది. అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు పూడిమడక సుందర తీరంలో పుణ్య స్నానాలు చేసేందుకు తరలివచ్చారు. దీంతో తీరం భక్తులు, యాత్రికలతో కిటకిటలాడుతోంది. ఆదివారం ఉదయం నాటికి వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి చేరుకొని సముద్రంలో స్నానాలు ఆచరిస్తున్నారు. సిఐ మురళి రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు.