ప్రధాని నరేంద్రీ మోదీపై బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీ విషయంలో కేంద్రానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఇదిలావుంటే ఈ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. పిటిషన్‌ను అత్యవసర విచారణ కోసం శుక్రవారం మళ్లీ ప్రస్తావించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం సూచించిన విషయం తెలిసిందే.
రెండు పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. ఈ డాక్యుమెంటరీని పబ్లిక్ డొమైన్ నుంచి తీసివేయాలని ఆదేశించిన అసలు ఉత్తర్వులను తమ ముందు ఉంచాలని కోరింది. డాక్యుమెంటరీని నిరోధించడానికి, సోషల్ మీడియా నుంచి లింక్‌లను తొలగించడానికి కేంద్రం అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని పిటిషినర్ ఎంఎల్ శర్మ సవాల్అసలు ఉత్తర్వులను తమ ముందు ఉంచాలని కోరింది. డాక్యుమెంటరీని నిరోధించడానికి, సోషల్ మీడియా నుంచి లింక్‌లను తొలగించడానికి కేంద్రం అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని పిటిషినర్ ఎంఎల్ శర్మ సవాల్ చేశారు. నిషేధిత ఉత్తర్వును కేంద్రం ఎప్పుడూ అధికారికంగా ప్రచురించలేదని, రెండు భాగాల డాక్యుమెంటరీపై నిషేధం ఏకపక్ష, రాజ్యాంగ విరుద్దమైనది అని న్యాయవాది ఎంఎల్ శర్మ వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించిందని, దీనిని చూస్తున్న వారిని అరెస్టులు చేయిస్తోందని ఆరోపించారు. తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్‌లు మరో పిటిషన్ వేశారు. ఈ రెండింటిని కలిపి సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. డాక్యుమెంటరీని స్వయంగా వీక్షించి గుజరాత్ అల్లర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషినర్లు కోరారు. మరోవైపు, పిటిషనర్లపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు. వేలాది మంది సామాన్యులు న్యాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి పిటిషన్లు వేయడం సుప్రీం కోర్టు విలువైన సమయాన్ని వృథా చేయడమేనని ఆయన దుయ్యబట్టారు.