భారత జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వినోద్ కాంబ్లీ మద్యం మత్తులో తనని హింసించాడని, అతని భార్య ఆండ్రియా హెవిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను దుర్భాషలాడాడని, వంట పాన్ హ్యాండిల్‌ని తనపైకి విసిరి గాయపర్చాడని ఆరోపించింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 1.30గంటల సమయంలో జరిగిందని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.