ఉసిరి దగ్గును నయం చేయడమే కాకుండా హైపర్‌యాసిడిటీ లక్షణాలను తగ్గించే గుణం కూడా కలిగి ఉంది. ఉసిరి రసాన్ని తేనెతో కలిపి రోజుకు 2 సార్లు త్రాగితే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. పెద్ద ఉసిరికాయను బాగా కడిగి, దాని నుండి గింజలను వేరు చేసి, కొద్దిగా కారం మరియు రుచికి ఉప్పు వేసి బాగా కలపాలి. తులసి ఆకులను బాగా కడిగి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఉసిరికాయలో కలుపుకుని తినాలి. కఫంతో బాధపడేవారు ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.