స్వీట్ కార్న్ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. స్వీట్ కార్న్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. స్వీట్ కార్న్ మలబద్ధకం మరియు పైల్స్ సమస్యలకు చెక్ పెడుతుంది. స్వీట్ కార్న్ లో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్ మరియు బయోఫ్లోవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలోని విటమిన్ బి-12, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ రక్తహీనతకు చెక్ పెడతాయి.