ఆర్టిసీపీలో జేపీఏగా పనిచేసున్న మేడా సుబ్రమణ్యం (45) ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. చిలమకూరులో నివాసం ఉంటున్న సుబ్రమణ్యంకు గుండెపోటు రావడంతో వెంటనే ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.