ఏపీలో బాల్యవివాహాలు చేసే వారిపై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీలను రాష్ట్ర బాలల హక్కుల సంఘం కమిషన్ చైర్మన్ అప్పారావు ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇటీవల కఠిన నిబంధనలు తీసుకొచ్చిందని తెలిపారు. ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా బాల్యవివాహాలు జరిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్ అంధకారమవుతుందని పేర్కొన్నారు.