హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్ల పతనం కంపెనీ ఆధారిత సమస్యగానే చూడాలని, దేశ ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా కాదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. స్టాక్ మార్కెట్‌లో ఒడుదొడుకులు సహజమని, కొన్ని మార్కెట్‌ను చిన్నగా ప్రభావితం చేస్తే, మరికొన్ని పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తాయన్నారు. అదానీ షేర్ల పతనం వ్యవహారాన్ని నియంత్రణ సంస్థలు చక్కదిద్దుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.