ఎస్. రాయవరం మండలం గోకులపాడు గ్రామంలో సోమవారం అభయ ఆంజనేయ స్వామి 28 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనేకమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు కమిటీ ఆధ్వర్యంలో ప్రసాదాలను పంపిణీ చేశారు. గ్రామంలో జాతర జరుగుతుంది. గ్రామ పెద్దలు మండలంలోని పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు.