మొన్నటి వరకు ప్రయాణికుల వల్ల తలనొప్పులు ఎదుర్కొన్న ఎయిర్ హెస్టెస్ తాజాాగా వారే ప్యాసింజర్ కు అవమానించిన ఘటన ఇది. ఇదిలావుంటే సాయం కోరినందుకు ఓ కేన్సర్ రోగిని విమానం నుంచి నిర్దాక్షిణ్యంగా దింపేశారు. జనవరి 30న జరిగిన ఈ ఘటనకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మీనాక్షి సేన్‌గుప్తా అనే మహిళకు కొద్ది రోజుల కిందట కేన్సర్ సంబంధిత శస్త్రచికిత్స జరిగింది. జనవరి 30న ఆమె ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం 293లో టికెట్ బుక్ చేసుకున్నారు. సర్జరీ వల్ల బలహీనంగా ఆమె వీల్‌ఛైర్ అసిస్టెంట్ ద్వారా విమానం ఎక్కారు. తర్వాత తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను క్యాబిన్‌లో పెట్టాలని ఎయిర్‌హోస్టెస్ సాయం కోరారు. అందుకు తిరస్కరించిన ఎయిర్‌హోస్టెస్.. విమానం నుంచి దిగిపోవాలని చెప్పారు మీనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు.
శరీరానికి సపోర్ట్‌గా ఉండే బెల్ట్ ధరించి ఉండటం వల్ల తాను బ్యాగ్‌ను పైకి ఎత్తలేకపోయానని, అందుకే విమాన సిబ్బంది సాయం కోరినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘వారం రోజుల కిందటే సర్జరీ జరగడంతో గ్రౌండ్ స్టాఫ్ నన్ను విమానం ఎక్కించారు.. వాళ్లు ఎంతో సహకరించారు.. తర్వాత నా బ్యాగ్‌ను క్యాబిన్‌లో పెట్టమని ఎయిర్‌హోస్టెస్ సాయం కోరాను.. అది తన ఉద్యోగం కాదని ఆమె వెళ్లిపోయింది.. నా ఆరోగ్యం గురించి ఆమెకు వివరించినా సాయం చేయడానికి ముందుకురాలేదు.. దీంతో నా బ్యాగ్‌ను సీటు పక్కన ఉంచి కూర్చునున్నాను. కొద్దిసేపటి తర్వాత మీకు అసౌకర్యంగా ఉంటే విమానం నుంచి దిగిపొమ్మని అమర్యాదగా చెప్పింది.. కాబిన్ సిబ్బంది మొత్తం నేను దిగిపోవాలని కోరడంతో విమానం నుంచి దిగిపోయాను’’ అని మీనాక్షి ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. దీంతో సదరు విమాయాన సంస్థ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన డీజీసీఏ నివేదిక సమర్పించాలని అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ను కోరింది. అటు, అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సూచనలు పాటించని కారణంగా ప్రయాణికురాలిని సిబ్బంది దింపేశారని సమర్ధించుకుంది.
‘‘జనవరి 30 ఢిల్లీ-న్యూయార్క్ విమానంలో సిబ్బంది సూచనలు పాటించని కారణంగా ప్రయాణికురాలిని మా క్యాబిన్ సిబ్బంది విమానం నుంచి దింపేశారు.. సదరు ప్రయాణికురాలితో మా కస్టమర్ రిలేషన్స్ సిబ్బంది మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం ’’అని అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.