గ్రీన్ టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నుండి కాపాడతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. గుండె సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. గ్రీన్ టీలో తక్కువ కెలోరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ టీని తాగొచ్చు.
గ్రీన్ టీ తాగితే రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. గ్రీన్ టీ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కీళ్ళ నొప్పి, కీళ్ళవాతం సమస్యల నుండి కాపాడుతుంది. రోగ నిరోదక శక్తిని పెంచుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.