ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వికలాంగులకు ప్రత్యేక స్పందన: జిల్లా కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 06, 2023, 03:06 PM

స్పందన కార్యక్రమం సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జాయింటు కలెక్టరు ఒ. ఆనంద్, ఐ. టి. డి. ఎ ప్రాజెక్ట్ అధికారి సి. విష్టు చరణ్, జిల్లా రెవెన్యూ అధికారి జి. వెంకటరావుతో కలసి స్పందన కార్యక్రమంను జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. దివ్యాంగ అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేకంగా స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు ఈ స్పందన కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెద్య ఆరోగ్య అధికారి బి. జగన్నాధం, డి. ఆర్. డి. ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా. ఎం. వి. జి. కృష్ణాజి, జిల్లా ఆర్. డబ్ల్యు. ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి. చిట్టి బాబు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం. డి. నాయక్, జిల్లా సరఫరా అధికారి కె. వి. ఎల్. ఎన్ మూర్తి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్, జిల్లా ప్రణాళిక అధికారి పి. వీర రాజు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com