పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. సోమవారం బొబ్బిలి పురపాలక సంఘం 03 సచివాలయ పరిధిలో గల 05వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం ప్రతీ ఇంటిఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు అమలుపై అరా తీశారు. ప్రతీ గడపలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అమలు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కుల, మత, భేదాలు లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరినీ తన సొంత కుటుంబంల చూస్తూ సంక్షేమ పాలన అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు, బొబ్బిలి మండల పార్టీ అధ్యక్షులు శంబంగి వేణుగోపాల నాయుడు, వైస్ ఛైర్మన్ చెలికాని మురళీకృష్ణ, బుడా ప్రతినిది ఇంటి గోపాలరావు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తెంటు పార్వతి, వార్డు ఇంచార్జ్ సిరిపురపు లక్ష్మీ, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, పట్టణ జేసీఎస్ కన్వీనర్ రేజేటి ఈశ్వరావు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, పట్టణ వైసిపి నాయకులు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.