దేశ అత్యున్నత న్యాయస్థానంలో కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు చేరారు. తెలుగు వ్యక్తి జస్టిస్ సంజయ్ కుమార్తో పాటు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్వీరితో ప్రమాణం చేయించారు. దీంతో సుప్రీంలో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరుకుంది. ఇక రెండే ఖాళీలు ఉన్నాయి.