కన్నతండ్రిపైనే కూతురు దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. మానసిక ఒత్తిడికి గురైన ఓ బాలిక తండ్రితో వాగ్వాదానికి దిగింది. ఈక్రమంలో పదునైన ఆయుధంతో తండ్రి మెడపై దాడి చేసింది. తీవ్రగాయాలపాలన బాధితుడిని బంధువులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కొద్దిరోజులుగా బాలిక మానసికస్థితి సరిగ్గా లేదని బంధువులు తెలిపారు.