2023-24 సంవత్సరానికి గాను సోమవారం ఉదయం శాసనసభ లో మంత్రి హరీష్‌రావు బడ్జెట్ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాకున్నా.. సంక్షేమపథకాలు ఆగకూడదన్న సీఎం కేసీఆర్ ఆలోచనతో బడ్జెట్ రూపొందించామని తెలిపారు. తెలంగాణ మోడల్ ను దేశం అవలంభిస్తోందన్నారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుందన్నారు. పేద ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి రెండూ జోడెద్దుల్లా బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి హరీష్‌రావు అన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి రెండింటికీ సమ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సేవలందిస్తోందన్నారు.