ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా హైకోర్టు తీర్పును బలపరుస్తూ అమరావతి రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేశారు.ఈ పిటిషన్లపై విచారణ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు.