కర్ణాటక మంగళూరులో నర్సింగ్-పారామెడికల్ కళాశాలలోని 130 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. హాస్టల్లోని ఆహారం తిన్న విద్యార్థులు కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు చేసుకోవడంతో ఇబ్బందులు పడ్డారు. దీంతో వీరిని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.