నాయుడుపేట మండలంలోని మర్లపల్లి వద్ద స్వర్ణముఖి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మంగళవారం ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులు ఫిర్యాదు మేరకు నాయుడుపేట ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
నాయుడుపేట మండలంతోపాటు ఐదు మండలాలకు సాగు, తాగు నీటిని అందించే వర ప్రసాదిని అయి న స్వర్ణముఖి నదిలో ఉన్న ఇసుక అక్రమార్కుల చేతివాటానికి ఎడారిని తలపిస్తుంది. పెళ్లకూరు, నాయుడుపేట , ఓజిలి మండలాల్లో కొందరు అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా రేయింబవళ్లు స్వర్ణముఖి నదిని తోడేస్తూ ఇతర ప్రాంతాలకు తరలించి లక్షల గడిస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లో నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిపోతున్న పట్టించుకునే వారు కరువయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు చోట నాయకులు, ప్రజాప్రతినిధులు ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నందు వల్లే సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామస్తుల అడ్డుకున్న ప్రాంతాల్లో తప్ప ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అధికారులు శోధ్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తూ ఇసుక అక్రమ రవా ణాకు పాల్పడుతున్నవారిపై పార్టీ అధిష్టానం దృష్టి సారించి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. అలాగే సంబందిత అధికారులు ఇసుక అక్రమ రవాణపై ప్రత్యేక నిఘా ఉంచి స్వర్ణముఖి నదిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.