గతంలో ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేయకుండా అప్పులు చేసిన టీడీపీని ప్రజలు చీపుర్లతో కొట్టాలని మంత్రి రోజా అన్నారు. పుత్తూరు మండల గృహసారథుల సమావేశం మంగళవారం నగరి వైసీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేయని వైసీపీని ప్రజలు చీపుర్లతో కొట్టాలని పాదయాత్రలో లోకేశ్ మాట్లాడిన మాటలను ఆమె ఖండించారు. టీడీపీ హయాంలో పేదలకు మూడు లక్షల ఇళ్లు కూడా ఇవ్వలేదని చెబుతూ తమ పార్టీ 32 లక్షల ఇళ్లు ఇచ్చిందన్నారు.ఎంపీపీ మునివేలు, వైసీపీ నాయకుడు రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.