వైసీపీ పార్టీ విశాఖపట్నం రూరల్ జిల్లా మాజీ అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడును అధిష్ఠానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.