శ్రీకాకుళం జిల్లా, జలుమూరు పరిధిలోని మట్టవానిపేటలో ఈ నెల 5న మొసలిపల్లి నిర్మల అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీనికి మృతికి కారణమైన భర్త నందేశ్వరరావును మంగళవారం అరెస్టు చేసి కోటబొమ్మాళి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ పి.పారినాయుడు తెలిపారు. పాతపట్నం మండలం కొయ్యకొండ గ్రామానికి చెందిన నిర్మలను భర్త నందేశ్వరరావు మానసికంగా వేధించడం వల్లే ఆమె ఆత్మ హత్యకు పాల్పడినట్లు మృతురాలి తండ్రి తూము రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.