సిలబస్‌లో వెనుకబడి, ట్యాబ్‌లను సక్రమంగా వినియోగించని ముత్యాలపల్లి హైస్కూల్ హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులకు మెమోలు అందించినట్టు విద్యా శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్(కాకినాడ) డి.మధుసూదనరావు చెప్పారు. మంగళవారం నరసాపురం మండలంలోని సీతారాపురం గ్రామంలో వెంకట్రావుతోట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజన, విద్య, సిలబస్, ట్యాబ్‌ల నిర్వహణ, నాడు–నేడు వంటి పనులను తనిఖీ చేశారు. అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ రీజనల్ పరిధిలో కృష్ణా, తూర్పు, కోనసీమ, కాకినాడ, పశ్చిమ, ఏలూరు వంటి జిల్లాలు ఉన్నాయన్నారు. పర్యటించిన ప్రతి జిల్లాలో ఉపాధ్యాయుల పనితీరుపై బాగోలేదన్నారు. విద్యా సంవత్సరం ముగుస్తున్నా.. ఇంకా 3, 4, 5, 9వ తరగ తు లకు సంబంధించిన సిలబస్ పూర్తి చేయకపోవడంపై ఉపాధ్యా యులపై అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న లక్ష్యంతో ఇచ్చిన ట్యాబ్‌లను ఎందుకు వినియో గించడం లేదని ప్రశ్నించామన్నారు. ఈ పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. ఇదేతీరు అవలంభిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రోజులో గంట పాటు ఉపా ధ్యాయులు విద్యార్థుల చేత ట్యాబ్‌లను ఉపయో గించాలన్నారు. పదిమంది కంటే ఎక్కువగా బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించి టీచర్లు నాన్ ఎడిషనల్ ట్రైనింగ్ సెంటర్లను ప్రారంభించాల న్నారు. తక్కువగా ఉంటే ఉపాధ్యా యులు దత్తత తీసుకోవాలన్నారు. తద్వారా గౌరవ భృతి కింద రూ.1500 చొప్పున వస్తుందన్నారు. మధ్యాహ్న భోజన రికార్డులు సక్రమంగా ఉండాలన్నారు. ఎక్కువ సేపు ట్యాబ్‌ను వినియోగించిన హేమంత్ రాఘవను ఆయన అభినందించారు. ఎంఈవో పుష్పరాజ్యం, సిబ్బంది పాల్గొన్నారు.