ప్రధాని మోడీ-అదానీ బంధంపై లోక్ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా సభా ఉల్లంఘనకుగానూ ఆయనపై సభా ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే.. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అలా మాట్లాడటం సభానియమామళికి విరుద్ధమని, ప్రధాని గౌరవాన్ని భంగపరిచేలా రాహుల్ వ్యవహరించారంటూ పేర్కొన్నారు.