వయసు పెరిగినా.. కొన్ని ఆహార నియమాలు పాటిస్తే మీ అందం ఎప్పటికీ అలానే ఉంటుంది. బచ్చలికూర, ఎర్ర మిరియాలు, క్యారెట్ వంటి కూరలు ఎక్కువగా తినడం వల్ల చర్మాన్ని వృద్ధాప్యం నుంచి రక్షించుకోవచ్చు. గింజలు, మొలకెత్తిన విత్తనాలు తినడం వలన చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. రోజువారీ ఆహారంలో టమోటాలు ఉండేలా చూసుకోండి. ఇవి చర్మంలోని ముడతలతో పోరాడుతాయి. అలాగే మీ చర్మానికి సెట్ అయ్యే క్రీమ్ వాడితే మేలని నిపుణుల సూచన.