చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ప్రత్యేక హోదా ఇచ్చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆయ న మాట్లాడుతూ... చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ప్రత్యేక హోదా ఇచ్చేశామని, దానికి సంబంధించి ఆయన రూ.15 వేల కోట్లు తీసుకున్నారని చెప్పారు. టీడీపీతో తాము కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఉన్నవి కుటుంబ పార్టీలని, ఈ రెండు పార్టీలను రాజకీయ ముఖచిత్రం నుంచి దూరం చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. అధికారం కోసం టీడీపీ, వైసీపీ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నాయని, తమ ఫోన్లూ ట్యాపింగ్ చేసినా ఆశ్యర్యపోనవసరం లేదని వ్యాఖ్యానించారు.