ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్తమాను తగ్గించుకోండిలా

Life style |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 01:05 PM

ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. ఆస్తమాతో బాధపడే వారు వైద్యుల సూచన మేరకు తప్పకుండా మందులు వాడుతూ ఉండాలి. అయితే ఆస్తమాను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
* యోగ, ధ్యానం వంటివి చేయాలి.
* కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటిలో బీ, సీ విటమిన్లు, బీటా కెరోటిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపు, మంట లక్షణాలను తగ్గిస్తాయి.
* వేడి నీటితో స్నానం చేయాలి.
* వేడి నీటిలో అల్లం, వెల్లుల్లి, లవంగాలు వేసి మరిగించి చల్లార్చి టీ లా తాగాలి. అల్లం వెల్లుల్లి ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి.
* అధిక కారం, మసాలాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినొద్దు.
* డిన్నర్ కు, పడుకునే సమయానికి మధ్య ఒక గంట గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
* వేడి పదార్థాలను మాత్రమే తినాలి.
* పాలు, గుడ్లు, చేపలు తినాలి.
* శరీరానికి సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి.
* వాతావరణం చల్లగా ఉంటే చల్లదనానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
* బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com