మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన నాయకుడు ఆదిత్య థాక్రే కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగినట్లు సమాచారం. అయితే ఈ దాడి జరిగిందా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. అయినప్పటికీ భద్రతా లోపాలపై రాష్ట్ర డీజీపీకి శాసనమండలి ప్రతిపక్ష నేత అంబాదాస్ ద్వానే లేఖ రాశారు. 'ఇది రెండు వర్గాల మధ్య చీలిక సృష్టించడానికి సంఘ వ్యతిరేకశక్తులు ప్రయత్నం' అని అందులో పేర్కొన్నారు.