టర్కీ, సిరియా దేశాల్లో భూకంపంలో ఇప్పటివరకూ 9,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. చాలా మంది నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. అలా మంచంపై నిద్రిస్తోన్న ఓ బాలిక మృతి చెందగా ఆమె చేయి పట్టుకుని ఆమె తండ్రి నిశ్చేష్టుడై ఉన్న ఫోటో హృదయాలను ద్రవింపచేస్తోంది. టర్కీలోని ఖహ్రమన్మరాస్ లో జరిగిందీ ఘటన.