ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10వ తేదీన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు, ప్రధానమంత్రి లక్నోను సందర్శిస్తారు, అక్కడ ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2:45 గంటలకు, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద రెండు వందేభారత్ రైలును ఆయన ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు.శాంతాక్రూజ్ చెంబూర్ లింక్ రోడ్ మరియు కురార్ అండర్ పాస్ ప్రాజెక్ట్ అనే రెండు రోడ్డు ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత, సాయంత్రం 4:30 గంటలకు, ముంబైలోని అల్జామియా-తుస్-సైఫియా కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు.ప్రధాన మంత్రి ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ని ప్రారంభిస్తారు. ఆయన గ్లోబల్ ట్రేడ్ షోను కూడా ప్రారంభిస్తారు మరియు ఇన్వెస్ట్ UP 2.0ని ప్రారంభిస్తారు.