టెక్ దిగ్గజం మెటా ఇటీవల 11 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా కంపెనీలోని మేనేజర్లు, డైరెక్టర్లను కంపెనీ సీఈఓ జుకర్ బర్గ్ హెచ్చరించారు. విధుల్లో భాగంగా మేనేజ్ మెంట్ చేస్తే సరిపోదని, కోడింగ్, డిజైనింగ్, రీసెర్చ్ వంటి విభాగాల్లో సైతం పనులు చేయాలని సూచించారు. సరైన ప్రతిభ చూపనివారి వెంచనే రాజీనామా చేయవచ్చని అన్నారు. ఈ వ్యాఖ్యలతో మరిన్ని లేఆఫ్ లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.