ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 17న వైఎస్సార్ లా నేస్తం కింద 65,537 మంది జూనియర్ న్యాయవాదులకు రూ.5 వేల సాయం చేయాలని నిర్ణయించింది. అలాగే ఫిబ్రవరి 24న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించనుంది. ఫిబ్రవరి 28న జగనన్న విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించనుంది. మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులకు రూ.700 కోట్ల మేర ఖాతాల్లో జమ చేయనుంది.