ప్రతిరోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని అర్బన్ సీఐ రాజు అన్నారు. బుధవారం ఉదయం పులివెందుల పట్టణంలో స్థానిక అర్బన్ పొలిటిషన్లో ఆయన పోలీసులకు యోగా పై శిక్షణ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. పోలీసులు విధులు ప్రతిరోజు ఒత్తిడితో కూడుకున్నదని, ఒత్తిడిని జయించేందుకు ప్రతిరోజు ఉదయం గంటసేపు యోగా , ధ్యానం అలవాటు చేసుకోవాలన్నారు. యోగా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు చిరంజీవి, హుస్సేన్, ఏఎస్సైలు చంద్రశేఖర్ స్వామి, రామచంద్రయ్య , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.