అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 21 ఏళ్ల కారెన్ జులియత్ కార్డెనాస్ అనే యువతి గత నెల 29న ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అనంతరం ఇంటికెళ్లిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో పేరెంట్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఊపిరితిత్తులు మొత్తం రక్తంతో నిండిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో యువతి ఆరుసార్లు కార్డియాక్ రెస్పిరేటరీ అరెస్ట్ కు గురై మృతి చెందింది.