ప్రజల ఆరోగ్యం కోసం యూపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు ఇండియా హెల్త్ లింక్ అనే సంస్థతో ఎంవోయూ కుదుర్చుకుంది. పీహెచ్సీ, సీహెచ్సీల్లో 4600 పైగా హెల్త్ ఏటీఎంలను త్వరలో అందుబాటులో ఉంచనుంది. వీటి ద్వారా బీపీ, వెయిట్, పల్స్, టెంపరేచర్, ECG వంటి హెల్త్ చెకప్ లను చేసుకోవచ్చు. ఈ మిషన్లు 5 నిమిషాల్లో రిపోర్టు అందించనున్నాయి.