ఏపీ లోని విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఒడిషాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య శవాన్ని భుజంపై మోస్తూ కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాడు. విశాఖలోని ఆసుపత్రికి భార్యను చికిత్స నిమిత్తం తీసుకువచ్చాడు. తిరుగు ప్రయాణంలో భార్య ఆటోలో మృతిచెందగా, ఆటో డ్రైవర్ వారిని దింపేసి వెళ్లిపోయాడు. భుజంపై భార్య శవంతో నడుచుకుంటూ వెళ్తున్న అతడిని చూసిన రూరల్ పోలీసులు అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపించారు.