ప్రస్తుత రోజుల్లో రోడ్డు పైకి వెళ్తే ఏ వైపు నుండి ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా ఇలాంటి వీడియో బయటికి వచ్చింది. కర్ణాటక తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకా అంచేపాల్య వద్ద ఓ యువకుడు రోడ్డు పక్కన బైక్ పై కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఓ లారీ అదుపుతప్పి బైకును బలంగా ఢీకొట్టింది. యువకుడు బైకు దిగి పక్కకు జరగడంతో ప్రాణాలు కాపాడుకున్నాడు. బైకు మాత్రం నుజ్జునుజ్జయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa